విరాటపర్వం కోసం చరణ్ ప్రచారం

TeluguCinema 14 Jun 2022
ram charan virata parvam

రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్స్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాటపర్వం’ జూన్ 17న గ్రాండ్ గా రిలీజవుతుంది. గత కొన్ని రోజులుగా సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తూ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రానా, సాయి పల్లవి. మరో మూడు రోజుల్లో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించి రేపు శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ram charan virata parvam 2

ఈ క్రమంలో రేపు ఈవెంట్ లో రామ్ చరణ్, వెంకీ, సుకుమార్ లు ఈ సినిమా గురించి ఏం చెబుతారనే ఆసక్తి అందర్లో ఉంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాను సుకుమార్ ఆల్రెడీ చూశాడు. సినిమా చూసిన సుకుమార్ ప్రేక్షకులకు ‘విరాటపర్వం’ ఎలా ఉండబోతుందో తన స్పీచ్ తో ఈవెంట్ లో చెప్పనున్నారు. రేపు ఈవెంట్ లో వెంకీ , చరణ్ , సుక్కు ఒకే వేదికపై కనిపిస్తూ సందడి చేయనున్నారు.