సింగిల్ గా ఉంటే డేటింగ్ చెయ్యాలా?

సింగిల్ గా ఉన్నంత మాత్రాన డేటింగ్ చెయ్యాలా? అని ప్రశ్న వేస్తోంది రష్మిక. కన్నడ నటుడుతో ఆమె పెళ్లి నిశ్చితార్థం జరిగి ఆగిపోయింది. “డియర్ కామ్రేడ్” షూటింగ్ టైంలో విజయ్ దేవరకొండతో దాటింగ్లో ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత సద్దుమణిగాయి. ఇప్పుడు మళ్ళీ ఒక యంగ్ హీరోకి క్లోజ్ అయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దాంతో ఆమె రియాక్ట్ అయింది. “నేను ప్రస్తుతం సింగిల్. చాలా హ్యాపీగా ఉన్నాను. సింగిల్ గా ఉండడం వల్ల ఉన్న సమస్య ఏంటంటే… ఎవరో ఒకరితో డేటింగ్ లో ఉందని వార్తలు అల్లేస్తారు. డేటింగ్ చెయ్యకుండా… సింగిల్ గా ఉండలేమా.. ఉండకూడదా?,” అంటూ ప్రశ్నిస్తోంది ఈ కూర్గ్ కోమలి.

Also Check: Rashmika Photos

ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన “పుష్ప” సినిమా సైన్ చేసింది. కానీ ఆ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. దానికోసమే నిరీక్షిస్తోంది. అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చాటింగ్ చేస్తోంది. అందులో ఎక్కువశాతం ఆమె లవ్ లైఫ్ గురించే ప్రశ్నలు.

Related Stories