రష్మికకి అప్పుడే మోకాళ్ళ నొప్పులు

- Advertisement -
Rashmika


హీరోయిన్ రష్మిక టాప్ బ్యూటీ. నిండా 26 ఏళ్ళు. ఒకవిధంగా చెప్పాలంటే చాలా చాలా యంగ్ ఈ అందాల సుందరి. కానీ, ఆమెకి అప్పుడే మోకాళ్ళ నొప్పులు వచ్చాయంట.

ఆమె తాజాగా ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ గురువారెడ్డిని కలిశారు. ఈ విషయాన్నీ ఆయనే బయటపెట్టారు.

“నువ్వు ‘సామి..సామి..’ అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!” అని మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకు వచ్చిన ‘శ్రీవల్లి’కి సరదాగా పెదవి విరుస్తూ ఇలా అన్నాను… పుష్ప సినిమా చుసిన మొదలు, రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది! బన్నీ కూడా త్వరలో Shoulder pain తో వస్తాడు ఏమో…,” అని తన ఫేస్ బుక్ లో పోస్టు చేసుకున్నారు.

రష్మికకి అప్పుడే మోకాళ్ళ నొప్పులు రావడంతో ఆమె ఈ డాక్టర్ ని కలిసింది. ఐతే, పెద్దగా వర్రీ కావాల్సిందేమి లేదని ఆయన చెప్పారట. పలువురు సెలెబ్రెటీలకు ఆయన ఫేవెరెట్ డాక్టర్.

రహస్యాలు బయటపెట్టడం సబబేనా!

Gif;base64,R0lGODlhAQABAAAAACH5BAEKAAEALAAAAAABAAEAAAICTAEAOw==

ఐతే, ఇలా సెలెబ్రిటీలు తమ ఆరోగ్య సమస్యలతో డాక్టర్లను కలిస్తే వాళ్ళ విషయాలను ఇలా బయటపెట్టడం ఎంతవరకు సబబు అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. సొంత సెల్ఫ్ డబ్బా కోసం గురువారెడ్డి డాక్టర్ గా పేషంట్ల విషయాలను గోప్యంగా ఉంచడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఐతే, ఆమె పర్మిషన్ తీసుకునే గురువా రెడ్డి పెట్టి ఉంటారని సమర్థిస్తున్నవాళ్ళూ ఉన్నారు.

ఏది ఏమైనా, చిన్న వయసులోనే రష్మికకి మోకాళ్ళ నొప్పులు రావడం విచారించదగ్గ విషయమే. సినిమా తారలు ప్రేక్షకులని అలరించేందుకు చేసే డ్యాన్స్ స్టెప్పులు ఇలాంటి సమస్యలను భరిస్తారు.

More

Related Stories