ఫిబ్రవరిలోనే ముహూర్తం

TeluguCinema 30 Oct 2025
Rashmika Mandanna

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. కానీ ఫిబ్రవరి చివర్లో ఉంటుంది అని టాక్.

రష్మిక మందాన, విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల దసరా సమయంలో వీరి నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ విషయాన్ని వాళ్ళు ఇంతవరకు అధికారికంగా చెప్పలేదు. కానీ పెళ్ళికి సంబంధించిన పనులు ఇరువైపులా పెద్దలు మొదలుపెట్టినట్లు టాక్.

ఫిబ్రవరిలో వీరి పెళ్లి ఉంటుంది. పెళ్లి వేడుక, ప్లేస్ వంటివి ఫిక్స్ చేసే పనిలో ఇరు కుటుంబాలు ఉన్నాయి. డేట్, వెన్యూ కుదిరిన తర్వాతే ఈ జంట తమ విషయాన్ని ప్రపంచానికి తెలియచేస్తారని అంటున్నారు.

మరోవైపు, ఆమె ఇప్పుడు “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రమోషన్లతో బిజీగా మారింది. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.