నాగార్జునకు క్రెడిట్ ఇచ్చిన రవితేజ

రవితేజ ఎక్కువమంది దర్శకులకు మొదటి అవకాశం ఇచ్చాడు. పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల వంటి బడా దర్శకులు రవితేజతోనే కెరీర్ మొదలు పెట్టారు. రవితేజ పెద్ద స్టార్ గా మారక హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ వంటి దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు. రవితేజ అవకాశం ఇచ్చిన దర్శకుల జాబితా చాలా పెద్దది కానీ అందులో చాలామంది సక్సెస్ కాలేదు.
ఐతే, కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చిన హీరోల్లో రవితేజ ముందు ఉంటాడు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దర్శకుడు కళ్యాణ్ శంకర్ (“మ్యాడ్” దర్శకుడు) రవితేజని పొగిడారు. ఎక్కువ మంది దర్శకులకు తొలి అవకాశం ఇచ్చిన హీరో మీరే అని కళ్యాణ్ శంకర్ పొగిడితే వెంటనే రవితేజ అతన్ని కరెక్ట్ చేశాడు. ఆ క్రెడిట్ నాగార్జున గారికే చెందుతుంది అని చెప్పాడు.
ALSO READ: Naga Vamsi: We can’t make Geethanjali with Ravi Teja
రవితేజ కన్నా ఎక్కువమంది దర్శకులని నాగార్జున పరిచయం చేశాడు. రామ్ గోపాల్ వర్మ నుంచి మొదలు పెడితే కళ్యాణ్ కృష్ణ వరకు డజన్ల కొద్దీ కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత నాగార్జున. ఆ తర్వాతే తాను రవితేజ వినమ్రంగా చెప్పాడు.