పైరసీలో సినిమాలు చూస్తా: RGV

TeluguCinema 24 Aug 2025
RGV

పైరసీని ప్రోత్సహించడం తప్పు. పైరసీలో సినిమాలు చూడడం నేరం. అంతా థియేటర్లలోనే సినిమాలు చూడండి అంటూ ఊదరగొడుతుంటారు టాలీవుడ్ జనం. అయితే తను మాత్రం అప్పుడప్పుడు పైరసీలోనే సినిమాలు చూస్తానంటూ సంచలన ప్రకటన చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

కాస్త బజ్ ఉన్న ప్రతి సినిమాను చూస్తాడట ఆర్జీవీ. కొన్నింటిని థియేటర్లలో చూస్తానని, మరికొన్నింటిని పైరసీలో చూస్తానంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పైరసీ వెబ్ సైట్ల పేర్లను కూడా ప్రస్తావించడం విశేషం.

పైరసీని ఆపడం ఎవ్వరి తరం కాదంటున్నాడు వర్మ. పైరసీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, దానితో పాటు సినీ ఇండస్ట్రీ కొనసాగాలని, పైరసీని అరికడతం అంటూ ఎవరైనా స్టేట్ మెంట్స్ ఇస్తే తనకు నవ్వొస్తుందని అన్నాడు వర్మ.

ప్రేక్షకుడు ఏ సినిమాకు ఎంత డబ్బు పెట్టాలో అంతే పెడతాడని, అంతకుమించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు పైరసీని ఆశ్రయిస్తాడని అంటున్నాడు వర్మ.