దీపిక కాపురం గురించి పుకార్లు


దీపిక పదుకోన్ కి ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆమె గత నాలుగు నెలల్లో రెండు సార్లు ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. రెండూ సార్లు ఛాతిలో నొప్పి, అసౌకర్యంగా ఫీల్ అవ్వడం వంటి కారణాల వల్లే ఆమె ఆస్పత్రి పాలు అయింది. మొన్న రాత్రి హడావిడిగా ఆమెని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇప్పుడు ఆమె కోలుకుంటున్నారు.

దీపిక గతంలో డిప్రెషన్ కి గురి అయింది. డిప్రెషన్ కి ఆమె చికిత్స కూడా తీసుకొంది. పెళ్ళైన మూడేళ్ల తర్వాత ఆమె మళ్ళీ డిప్రెసన్ లోకి వెళ్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆమె తరుచుగా ఆస్పత్రి పాలు అవుతుండడంతో ఇప్పుడు పుకార్లు మొదలయ్యాయి.

దీపిక, ఆమె భర్త రణ్వీర్ సింగ్ మధ్య గొడవలున్నాయి అని ఒక జర్నలిస్ట్ ఈ రోజు ట్విట్టర్ లో పెట్టడంతో వారి కాపురం గురించి రకరకాల వార్తలు, ఊహాగానాలు షికారు చెయ్యడం మొదలైంది. రణ్వీర్ సింగ్, దీపిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ కెరీర్ పరంగా టాప్ పొజిషన్ లోనే ఉన్నారు.

ALSO READ: Deepika Padukone hospitalized again

‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్ సమయంలో ఆమె మొదట ఆస్పత్రి పాలు అయింది. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా ఆమె “అనీజి”గా ఫీల్ అవ్వడంతో వెంటనే కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పుడు ముంబైలో సేమ్ సమస్య. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు అని అభిమానులు అంటున్నారు.

దీపిక, రణ్వీర్ ఈ పుకార్లపై ఇంకా స్పందించలేదు.

 

More

Related Stories