
సాయిపల్లవి… ఎప్పుడు చూసినా సంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. స్కిన్ షోకు ఆమడ దూరం ఈ పిల్ల. సగటు హీరోయిన్ పోజులు కూడా ఇవ్వదు. ఇలాంటి అమ్మాయి బీచ్ లో అడుగుపెట్టింది.
స్విమ్మింగ్ చేసింది. చెల్లెలితో ఫొటోలు దిగింది. వాటిని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
బీచ్ లో సెల్ఫీలు దిగినా సంప్రదాయబద్ధంగానే ఉన్నాయని, ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా సాయిపల్లవి వ్యవహరించిందంటూ అంతా ఆమెకు మెచ్చుకుంటున్నారు.
పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిలైంది సాయిపల్లవి చెల్లెలు. ఆమెను చూడ్డానికి కుటుంబంతో కలిసి వెళ్లిన సాయిపల్లవి, అక్కడిలా బీచ్ లో సందడి చేసింది. సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది సాయిపల్లవి. ఈ ఫొటోల్ని ఆమె చెల్లెలు పూజ పోస్టు చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ‘రామాయణ్’ సినిమా చేస్తోంది సాయిపల్లవి. దీంతో పాటు అమీర్ ఖాన్ కొడుకు సరసన కూడా ఓ సినిమా చేయడానికి అంగీకరించింది.





