నా దగ్గర స్టోరీ లేదు బ్రో!

- Advertisement -
Sai Rajesh, Kiran Abbavaram

ఇటీవల పెద్ద హిట్ అయిన చిన్న మూవీ… బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి చైతన్యలతో ఎస్కెఎన్ నిర్మించిన ఆ సినిమాకి సాయి రాజేష్ దర్శకుడు. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో సాయి రాజేష్ తదుపరి చిత్రం గురించి అంచనాలు, ఊహాగానాలు పెరిగాయి.

తాజాగా కొన్ని వెబ్ సైట్లు సాయి రాజేష్ తదుపరి చిత్రం ఈ హీరోతోనే అంటే కథనాలు అల్లేశాయి. అవి పుకార్లు తప్ప నిజం కాదని దర్శకుడు సాయి రాజేష్ అంటున్నారు. “నా దగ్గర స్టోరీయే లేదు మీడియా బ్రో… మీరు అప్పుడే హీరో ఫిక్స్, స్టోరీ రెడీ అంటే ఎలా?” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

యువ హీరో కిరణ్ అబ్బవరంతో సాయి రాజేష్ సినిమా ఫిక్స్ అయిందని వచ్చిన వార్తలకు ఆయన స్పందన ఇది.

“బేబీ”కి ముందు సాయి రాజేష్ “హృదయ కాలేయం” అనే స్పూఫ్ మూవీ తీశారు. అలాగే, “కలర్ ఫోటో” చిత్రానికి స్క్రిప్ట్ అందించారు.

 

More

Related Stories