ఆ 4 సినిమాల ఒత్తిడి పోయినట్లే!

- Advertisement -
Sreeleela

తెలుగులో బిజీ హీరోయిన్ ఎవరంటే శ్రీలీలనే. ఒకేసారి అరడజన్ చిత్రాలు ఒప్పుకొని సంచలనం సృష్టించింది. అందులో కొన్ని చిత్రాలు షూటింగ్ లో ఉండగానే మరో రెండు, మూడు సైన్ చేసింది. ఆమె డేట్స్ కోసం హీరోలు, నిర్మాతలు పడిగాపులు కాయాల్సివస్తోంది. ఐతే, ఆమె కూడా రెస్ట్ లేకుండా కష్టపడింది. మొత్తానికి ఒప్పుకున్న 8 సినిమాల్లో 4 చిత్రాల షూటింగ్ పూర్తి చేసింది.

“స్కంద”, “ఆదికేశవ” సినిమాల షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ నెల 28న “స్కంద” విడుదల కానుంది. ఇక వచ్చే నెలలో “భగవంత్ కేసరి” రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి కేవలం 5, 6 రోజుల పని మాత్రమే మిగిలి ఉంది. ఇక “ఆదికేశవ” షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలమే అయింది. ఈ మూవీ నవంబర్ లో విడుదల కానుంది.

ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానున్న నితిన్ మూవీ “ఎక్సట్రా”కి సంబంధించి కొంత పని మిగిలి ఉంది. సో… ఈ నాలుగు చిత్రాలకి సంబంధించిన ఒత్తిడి పోయింది.

ఇక ఆమె “గుంటూరు కారం”, “ఇస్తాద్ భగత్ సింగ్” చిత్రాల షూటింగ్ పై హాయిగా ఫోకస్ వేసుకోవచ్చు.

 

More

Related Stories