సంపాదనపై ఫుల్ ఫోకస్


సమంత ఇప్పుడు తన ప్రాధాన్యాలు మార్చుకొంది. ఆమె ఇప్పుడు డబ్బు వెనకేసుకోవాలని అనుకుంటోంది. అందుకే వరుసగా ప్రాజెక్ట్స్ ఒప్పుకొంటోంది.

సమంత రెండేళ్ల క్రితం తన భర్త నాగ చైతన్య నుంచి విడిపోయింది. విడిపోయిన కొన్నాళ్ళకు ఆమె అనారోగ్యం పాలైంది. ఇప్పుడు కోలుకొని మళ్ళీ సినిమాలు చేస్తోంది. ఆమెకిప్పుడు 36 ఏళ్ళు. హీరోయిన్ గా ఆమెకి ఇంకా రెండు, మూడేళ్ళ కంటే పెద్దగా కెరీర్ ఉండదు. ఇప్పుడు వెబ్ సిరీస్ ల వల్లో, సినిమాల వల్లో ఆమె ఇండియా అంతా పాపులర్ అయింది. అందుకే, ఈ 3, 4 ఏళ్ల టైంలోనే వీలైనన్ని ప్రాజెక్ట్స్ చేసి సంపాదించుకోవాలనేది ఆమె ప్లాన్.

హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నప్పుడే బ్రాండ్స్, ఇన్ స్టాగ్రామ్ ఇతర ఆదాయం ఎక్కువ వస్తుంది. హీరోయిన్ గా కాకుండా రెగ్యులర్ పాత్రలు చేస్తే అంత ఆదాయం ఉండదు. అందుకే, ఆమె ఇప్పుడు సంపాదనపై దృష్టి పెట్టారు అని టాక్.

ఆమె తదుపరి చిత్రం.. ఖుషి. ఈ సినిమాలో విజయ దేవరకొండ హీరో. ఇక హిందీలో ‘సిటాడెల్’ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. తాజాగా ‘చెన్నై స్టోరీ’ అనే ఒక అంతర్జాతీయ చిత్రం కూడా ఒప్పుకొంది సమంత.

Advertisement
 

More

Related Stories