సమంత పూజ పునస్కారాలు

TeluguCinema 13 Oct 2025
Samantha

సమంత రుత్ ప్రభు… పుట్టింది క్రిస్టియన్ గా. ఐతే, ఆమె నాగ చైతన్యతో ప్రేమలో పడ్డాక హిందువుగా మారింది. పూర్తిగా హిందూ మతంలోకి మారి తిరుమల తిరుపతి దర్శనాలు చేసుకోవడాలు, ప్రత్యేకంగా పూజలు చెయ్యడం మొదలుపెట్టింది. ఐతే, నాగ చైతన్యతో పెళ్లి పెటాకులు అయింది. నాలుగేళ్లకే వాళ్ళు విడిపోయారు.

చైతన్యతో విడాకుల తర్వాత ఆమె తన క్రైస్తవ మతాన్నే మళ్ళీ పాటిస్తారు అనుకున్నారు చాలామంది. కానీ ఆమె మరింతగా పూజలు చెయ్యడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంట్లో చిన్నపాటి గుడి కూడా పెట్టుకొని ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఆ మధ్య శ్రీకాళహస్తికి వెళ్లి శని గ్రహ దోష నివారణ పూజలు చేశారు.

తాజాగా ముంబైలోని తన కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు చేసింది. ఆ ఫోటోలను కూడా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె తాజా బాయ్ఫ్రెండ్, దర్శకుడు రాజ్ కూడా కనిపిస్తుండడం విశేషం.

ఆమె గతంతో పోల్చితే ఇప్పుడు ఇంకా ఎక్కువ భక్తి అలవర్చుకున్నారు. హిందువుగానే జీవనం కొనసాగిస్తున్నారు. అలాగని ఆమె డిసెంబర్ లో క్రిస్మస్ కి చర్చికి వెళ్లారని కాదు. క్రీస్తుని ఆరాధిస్తారు. ఇటు హిందూ దేవతలకు పూజలు చేస్తారు.