త్వరలోనే సంజన పెళ్లి

Sanjjana

సంజన గల్రాని లక్డౌన్ లో ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ చేసుకొంది. కాకపోతే, ఆ విషయం బయటికి రాకుండా చూసుకొంది. డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లి వచ్చాక, ఆమె ఆలోచన మారిపోయింది. ఇక పెళ్లి చేసుకొని సినిమా రంగానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట.

డాక్టర్ పాషాతో ఆమెకి ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరిగింది. అతనితోనే పెళ్లి. ఈ వేసవి సెలవుల్లో వీరి వివాహ వేడుక ఉంటుందట.

సంజన ఒకప్పుడు హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై… ఇలా చక్కర్లు వేసేది. సినిమాలు ఉన్నా …లేకున్నా ఎప్పుడూ బిజీగా ఉండేది. ఐతే, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాత ఆమె మారిపోయింది. ఇప్పుడు బెయిల్ పైనే ఉంది. సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టీవ్ గా మారింది. కానీ, ‘కొన్ని’ శక్తులకు దూరంగా ఉంటోంది. పెళ్లి చేసుకుంటే… కొన్ని వివాదాలకు దూరంగా ఉండొచ్చని అనుకుంటుందట.

More

Related Stories