ఎన్టీఆర్ దేనికైనా సూట్ అవుతాడు!

ఎన్టీఆర్ మేకోవర్ కు, అతడి యాక్టింగ్ టాలెంట్ కు మరో సీనియర్ నటి ఫిదా అయింది. ఆమె మరెవరో కాదు, మధుబాల. తారక్ యాక్టింగ్ చూసి షాక్ అయ్యానని అంటోంది మధుబాల.
సింగిల్ టేక్ లో షాక్ ఓకే అవుతుంటే తను చాలా ఆశ్చర్యపోయానని, ఎన్టీఆర్ కు ఇదంతా ఎలా సాధ్యం అయిందా అని 2-3 రోజులు ఆలోచించానని తెలిపింది. ఇదంతా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టైమ్ లో.
ఆ సినిమాలో తొలిసారి తారక్ తో కలిసి పనిచేసిన మధుబాల, అతడి డెడికేషన్ కు పడిపోయింది. తారక్ ఎప్పటికైనా మంచి పొజిషన్ కు వెళ్తాడని అప్పుడే అనుకున్నానని, తను అనుకున్నట్టుగానే టాప్ లో ఉన్నాడని అంటోంది.
‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ మేకోవర్ అయిన విధానం తనకు బాగా నచ్చిందంటోంది మధుబాల. తామిద్దరం కలిసి స్పెయిన్ లో కొన్ని రోజులు షూటింగ్ చేశామని, అప్పుడే తారక్ తో తనకు పరిచయం ఏర్పడిందని అంటోంది.