తండ్రి కాబోతున్న శర్వానంద్

Sharwanand and Rakshita


హీరో శర్వానంద్ తండ్రి కాబోతున్నాడు. శర్వానంద్ కాస్త లేట్ గా పెళ్లిచేసుకున్నారు. ఆయనికిప్పుడు 39 ఏళ్ళు. ఇండియన్ స్టాండర్డ్ లో చూస్తే చాలా లేట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఐతే, ఏడాది లోపే తండ్రి కాబోతున్నారు.

ఈ ఏడాది జూన్ లో శర్వానంద్ రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇప్పుడు గర్భవతి.

ఆంధ్రపదేశ్ రాజకీయ కుటుంబానికి చెందిన రక్షిత అమెరికాలో పెద్ద కంపెనీలో మంచి పొజిషన్ లో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా శర్వానంద్ అమెరికా, ఇండియా ట్రిప్పులు వేస్తున్నారు. ఇక ఆమె అక్కడే డెలివరీకి సిద్ధమయ్యారట.

మరోవైపు, శర్వానంద్ నటిస్తున్న 30వ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి “మనమే” అనే పేరుని పరీశీలిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేసి విడుదల తేదీ ఫిక్స్ చేస్తారు.

Advertisement
 

More

Related Stories