శిల్పాశెట్టి విడాకులపై పుకార్లు


ఒకప్పటి టాప్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇక తన భర్త నుంచి విడిపోవాలనుకుంటుంది అని ప్రచారం జరుగుతోంది. తన భర్త నీలి చిత్రాల నిర్మాణంలో ఉన్నాడు అన్న విషయం ఆమెకి తెలియదంట. ఆ అభియోగాలతో ఆమె భర్తని పోలీసులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఆమె భర్త చేసిన పనికి ఆమె కొన్నాళ్ళు షాక్ లో ఉందట. ఇప్పుడు ఆమె ఎప్పటిలాగే తన టీవీ షోలు చేసుకుంటోంది.

తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. “జీవితంలో వెనక్కి వెళ్లి కొత్తగా ప్రయాణం మొదలు పెట్టలేం. కానీ ఇప్పటి నుంచి మొదలుపెట్టి కొత్తగా ప్రయాణాన్ని ముగించొచ్చు.” ఇది ఆమె షేర్ చేసిన ఒక పుస్తకంలోని కొటేషన్ సారాంశం. దాంతో “కొత్త ఎండింగ్” అంటే విడాకులే అని ప్రచారం మొదలైంది.

భర్త రాజ్ కుంద్రాని ఆమె క్షమించకూడదని నిర్ణయించుకుందని అంటున్నారు.

శిల్ప, రాజ్ కుంద్రాల వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమెకిప్పుడు 46 ఏళ్ళు. ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉంటుంది.

Advertisement
 

More

Related Stories