పెళ్ళి కోసమే ఈ ప్రిపరేషన్

Shraddha Kapoor


శ్రద్ధ కపూర్ చాలా కాలంగా తన బాయ్ ఫ్రెండ్ రోహన్ తో రిలేషన్ లో ఉంది. వీరిద్దరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఫైనల్ గా ఇప్పుడు అంతా సెట్ అయింది. శ్రద్ధ కపూర్ ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ లో ఉంది. ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ట్ కూడా ఉన్నాడు. కాకపొతే, ఫొటోల్లో అతను కనిపించకుండా జాగ్రత్త పడుతోందట.

పెళ్ళికి ఇరువైపులా పెద్దలు ఒప్పుకున్న తర్వాతే వీరు వెకేషన్ కి వెళ్లారట. ముహూర్తం ఈ ఏడాది చివర్లో ఉంటుందనేది టాక్.

శ్రద్ధ తెలుగులో ‘సాహో’ సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో మూవీ చెయ్యలేదు. ఇప్పుడు హిందీలో కూడా సినిమాలు తగ్గించుకుంటోంది. ఆమెకిప్పుడు 34 ఏళ్ళు. ఇప్పటికే పెళ్లి ఆలస్యం అయిందని అనుకుంటోంది.

More

Related Stories