- Advertisement -

నటిగా మళ్లీ బిజీ కావాలనుకుంటోంది శ్రియా. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో ఒక చిన్న పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత మరిన్ని ఆఫర్లు పెరుగుతాయనేది ఆమె ఆశ. ఇప్పటికే ఆమె 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకొంది. పెళ్లయిన తర్వాత విదేశాల్లో స్థిరపడింది. దాంతో, ఆమెకి ఆఫర్లు రావడం లేదు.
ఐతే, ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అవుతోంది. సో, కొత్త ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు షురూ చేసింది.
ఆమె అందాల సోయగం ఇప్పటికీ మారలేదు. కానీ ఆమెకి మెయిన్ హీరోయిన్ కెరీర్ ఎప్పుడో ఎండ్ అయింది. సీనియర్ హీరోలు కూడా కాజల్ అగర్వాల్, తమన్న వంటి భామలతో జత కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. సో… ఆమె ఇక హీరోయిన్ ఆఫర్లు గురించి ఆలోచించడం మానెయ్యల్సిందే.
ALSO CHECK: Shriya Saran’s random clicks