ఇవి దొంగిలించాలి: శృతి హాసన్

శృతి హాసన్ చాలా కాలం తర్వాత ఒక సినిమా ప్రమోషన్ లో పాల్గొంటోంది. ఆమె నటించిన కొత్త చిత్రం… కూలీ. ఈ సినిమాలో ఆమె సత్యరాజ్ కూతురిగా నటించింది. రజినీకాంత్ చిత్రంలో ఆమె మొదటి సారి నటించడం. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఆమె పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె దొంగతనం గురించి మాట్లాడింది. తాను దొంగగా మారి కొన్ని నాకు చోరీ చెయ్యాలని ఉంది అని చెప్తోంది.
“ప్రభాస్ వంట అతన్ని తీసుకెళ్లాలి. అల్లు అర్జున్ డ్యాన్స్, మహేష్ బాబు అందం దొంగిలించాలి. అలాగే నాగార్జున గారి ఎనర్జీ ఎత్తుకెళ్ళాలి,” అని శృతి హాసన్ చెప్పింది.
అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగార్జున గురించి ఈ భామ ప్రత్యేకంగా మాట్లాడింది. నాగార్జున ఈ సినిమాలో విలన్ గా నటించారు.
“కూలీ” సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున తో నటించిన శృతి హాసన్ కి ఈ సినిమా ప్రత్యేకం. లోకేష్ ఆమెకి మంచి స్నేహితుడు. ఇక తన తండ్రి స్నేహితుడు రజినీకాంత్ సినిమాలో నటించడం మరీ స్పెషల్.