దక్షణాది రంగు, పొంగు బెస్ట్!

- Advertisement -
Sobhita Dhulipala

శోభిత ధూళిపాళ ఇప్పుడు హిందీ వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయింది. సెక్స్ సీన్లు చెయ్యడంలో ఎలాంటి అభ్యంతరం చెప్పని ఈ భామ ఇప్పుడు ముంబైలో హాట్ హాట్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ఐతే కెరీర్ ప్రారంభంలో మాత్రం తన శరీర రంగు గురించి ఎక్కువగా కామెంట్స్ విన్పించాయి అని చెప్తోంది.

అప్పుడు కొంచెం చులకనగా మాట్లాడేవారు. కానీ, టాలెంట్ ని మాత్రమే చూసే కొందరు దర్శక, నిర్మాతల కారణంగా తనకు మంచి అవకాశాలు వచ్చాయి అని అంటోంది ఈ భామ.

“దీపిక పదుకోన్ ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్. దీపికని చూసిన తర్వాతే దక్షిణాది కలర్ గురించి, నా లుక్స్ గురించి వర్రీ కావొద్దని ధీమా వచ్చింది. ఇంకా చెప్పాలంటే దక్షిణాది సౌందర్యం, ఈ రంగు పొంగులను అందరూ గర్వంగా చెప్పుకోవాలి,” అని చెప్తోంది ఈ వైజాగ్ వనిత.

ఛామన ఛాయ లేదా నలుపు కలర్ గురించి బాగానే చెప్తోంది. కానీ ఫోటోషూట్ లలో మాత్రం తెల్లగా కనిపించేలా ఎందుకు మేకప్ వేసుకుంటుంది అనేదానికి సమాధానం ఇస్తే బాగుండు.

Sobhita Dhulipala

శోభిత ధూళిపాళ ప్రస్తుతం హీరో నాగ చైతన్యతో డేటింగ్ లో ఉంది. తెలుగులో కొత్తగా ఏ సినిమాలు చెయ్యడం లేదు. ఆమె పూర్తి ఫోకస్ బాలీవుడ్ లో, హిందీ వెబ్ సిరీస్ లలో కెరీర్ డెవలప్ చేసుకోవడమే.

 

More

Related Stories