శ్రీముఖి పెళ్లి లొల్లి ఉత్తదే

శ్రీముఖి పెళ్లి లొల్లి ఉత్తదేహీరోలలో ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని పుకార్లు వచ్చాయో హీరోయిన్లలో శ్రీముఖికి అలాంటి ట్రాక్ రికార్డు ఉంది. ఆమె పెళ్లి గురించి ఎన్నెన్నో వార్తలు.

“శ్రీముఖి పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి ముహూర్తం సెట్ అయింది… వరుడు ఎవరో కాదు.. ఆమె బాయ్ఫ్రెండ్… తల్లితండ్రులు ఓకే చెప్పారు…” అంటూ గత నెలలో చాలా హడావిడి జరిగింది. కొత్త ఏడాది స్టార్టింగ్ లోనే ఈ భామ పెళ్లి అంటూ వచ్చిన వార్తలు విన్నాం.

ఈ అమ్మడు గత కొంత కాలంగా ఒక బిజినెస్ మెన్ తో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారాన్ని నడుపుతోందని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. ఆ బిజినెస్ మెన్ బాయ్ ఫ్రెండ్ తోనే ఆమె మేరేజ్ అంటూ యూట్యూబ్, వెబ్ సైట్లు, ఛానెల్స్ హోరెత్తించాయి. తీరా ఇప్పుడు అదంతా ఉత్తిదే అని తేలింది.

ఆమె పెళ్లిపీటలు ఎక్కబోతున్నది అని వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంట.

 

More

Related Stories