జాక్వెలిన్ ‘వీడియోలు’ బయటపెడతాడట

TeluguCinema 23 Dec 2023
jacquline stills 22223 004

హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె తన మాజీ గాళ్ ఫ్రెండ్ అని, ఆమె కోసం తాను చాలా ఖర్చు పెట్టానని సుకేష్ చంద్రశేఖర్ చాలా కాలంగా చెప్తున్నాడు. కోట్ల రూపాయల మోసం కేసులో సుకేష్ జైల్లో ఉన్నాడు. త్వరలోనే తాను కొన్ని ఆధారాలు బయట పెడతానని తాజాగా సుకేస్ బాంబు పేల్చాడు.

ఏ ఆధారాలు బయట పెడుతాడో తెలియదు కానీ కొన్ని వీడియోలు వదులుతాడు అని మీడియా వార్తలు చెప్తున్నాయి.

జాక్వెలిన్ తో సుకేష్ తీసుకున్న వీడియోలు అయి ఉంటాయి అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు అతను జాక్వెలిన్ (Jacqueline Fernandez)తో దిగిన సెల్ఫీ ఫోటోలను విడుదల చేశాడు. ఇప్పుడు రొమాంటిక్ వీడియోలు వదులుతాడు కాబోలు అని ఊహాగానాలు మొదలయ్యాయి.

జాక్వెలిన్ ఇతని కారణంగానే తెలుగులో చాలా అవకాశాలు పోగొట్టుకొంది. ఒక పెద్ద సినిమాలో ఐటెం సాంగ్, మరో పెద్ద సినిమాలో కీలక పాత్ర ఆమెకి దక్కినట్లే దక్కి వెనక్కి వెళ్లాయి. దానికి కారణం…. సుకేష్ కేసులో ఆమె జైలుకి వెళ్లాల్సి వస్తే తమ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపెయ్యాల్సి వస్తుందేమో అని ఆ తెలుగు నిర్మాతలు జంకారు.

ALSO Check: Jacqueline Fernandez dancing at an event