
హీరోయిన్ తాప్సి బాగానే సంపాదిస్తోంది ఇప్పుడు. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఆమె. బాలీవుడ్ లో పారితోషికం కూడా 4 కోట్ల రేంజ్ లో ఉంది. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తోంది. అంటే ఆమె ఆర్జన అదుర్స్. కానీ, ఇంకా సంపాదించాలి అనే టార్గెట్ పెట్టుకొంది.
పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం: బాగా కూడబెట్టుకున్నాకే పెళ్లి. ఎన్ని కోట్ల బ్యాంకు బ్యాలన్స్ ఉండాలో. ఆ టార్గెట్ చెప్పట్లేదు. ఆమె ప్రస్తుతం ఒక ఇంటర్నేషల్ బాడ్మింటన్ ప్లేయర్ తో డేటింగ్ లో ఉంది. కానీ వీరి రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందా అనేది చూడాలి.
మరోవైపు, తాప్సి ఇటీవలే ‘హసీనా దిలరుబా’ అనే సినిమాలో నటించింది. అది డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమాకి ఆమెకి పెద్దగా పేరు రాలేదు. కొందరు విమర్శకులు తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో హంగామా కూడా చేసింది. ఐతే, ఆమె నటించిన ప్రతి సినిమాని పొగడలా అంటూ కామెంట్స్ పడుతున్నాయి.
నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటుంది తాప్సి. సోషల్ మీడియాలో హంగామా వల్లే తొందర్లో బాలీవుడ్ లో పాపులర్ అయింది. ఇప్పుడు చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఏడాదికి ఐదారు సినిమాలు చెయ్యాలనేది టార్గెట్. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గిస్తుందట.