100K డాలర్స్ వసూళ్ల ‘వెడ్డింగ్ షో’

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ రూపొందింది. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న ఈ సినిమా విడుదలైంది.
విడుదలకు ముందు వేసిన ప్రివ్యూ షోలతోనే మంచి టాక్ తెచ్చుకొంది ఈ మూవీ. ఆ తర్వాత టాక్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఈ సినిమా అమెరికాలో మంచి కలెక్షన్లను పొందింది. ఇప్పటికే 100K డాలర్స్ వసూళ్లు అందుకొంది. అంటే దాదాపుగా 87 లక్షల రూపాయలు. నార్త్ అమెరికాలో మంచి లాభాలు చూసింది.
భారీ స్పెషల్ ఎఫెక్ట్స్, భారీతనంతోనే కాకుండా నిజాయతీ, నైపుణ్యంతో మంచి కథ ఉంటే చాలని మరోసారి ఈ సినిమా నిరూపించింది.
తిరువీర్ కెరీర్ కి ఇది మంచి బూస్టప్ అని చెప్పాలి. అతని ఖాతాలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. వాటి విడుదలకు మోక్షం కలుగుతుందిక.