త్రిష హీరోయిన్ గా వెబ్ సిరీస్!

Trisha


తెలుగులో పెద్ద సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసే అవినాష్ కొల్ల, తన సోదరుడు అశోక్ కొల్లతో కలిసి అండ్ స్టోరీస్ (&Stories) అనే నిర్మాణ సంస్థని ప్రారంభించారు. “సోనీ లివ్” అనే ఓటీటీ కోసం మొదటి వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష నటించనుంది. త్రిషకి ఇప్పుడు హీరోయిన్ గా తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే, వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆమె అంగీకరించింది.

“బృందా” అనే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోన్నారట. స్క్రిప్ట్ నచ్చడంతో ఆమె ఈ సిరీస్ ని అంగీకరించారు. దసరా సందర్భంగా లాంచ్ అయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రాబోతోన్న వెబ్ సిరీస్ ఇది. సూర్య వంగల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవింద్ర విజయ్, ఆనంద్ సామి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు.

Advertisement
 

More

Related Stories