ఆగిపోయిన సినిమా మళ్ళీ స్టార్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దాదాపు రెండేళ్ల క్రితం “టైసన్ నాయుడు” అనే సినిమా మొదలు పెట్టాడు. పవన్ కల్యాణ్ తో “భీమ్లా నాయక్” సినిమా తీసిన దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పటివరకు పూర్తి కాలేదు.
“టైసన్ నాయుడు” కన్నా లేట్ గా మొదలైన “భైరవం”, “కిష్కింధపూరి” విడుదల అయ్యాయి. ‘కిష్కింధపురి’ యావరేజ్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు మళ్ళీ కొంచెం మార్కెట్ పెరిగింది అని చెప్పాలి. అంతకుముందు చిత్రాలన్నీ ఘోరంగా పోయాయి.
‘కిష్కింధపురి’ బ్రేక్ ఈవెన్ కావడంతో “టైసన్ నాయుడు” నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ ఆపేసిన సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డారు.
బాలీవుడ్ కి వెళ్లి “ఛత్రపతి” సినిమా చేసి బొక్కాబోర్లా పడ్డాడు శ్రీనివాస్. దాంతో, అతనికి ఉన్న ఎంతో కొంతో హిందీ మార్కెట్ (యూట్యూబ్ డబ్బింగ్ హక్కుల ద్వారా) మొత్తంగా పడిపోయింది. శ్రీనివాస్ చిత్రాలకు పెద్దగా ఓటిటి క్రేజ్ లేదు. పైగా, “టైసన్ నాయిడు” చిత్ర నిర్మాతలు మరోవైపు బాలయ్యతో “అఖండ 2″లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. దాంతో, “టైసన్ నాయిడు”కి డబ్బులు అడ్జెస్ట్ చేయలేక చాన్నాళ్లు సినిమాని పడుకోబెట్టారు. ఇప్పుడు మొత్తానికి ట్రాక్ లోకి వచ్చింది.
మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాడు టైసన్ నాయిడు.