ఎల్లమ్మకి మోక్షం ఎప్పుడో

“బలగం” సినిమాతో దర్శకుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. అంతకుముందు కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించినా వేణు దర్శకుడిగా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. అలాగే తెలంగాణ ప్రజల నుంచి ప్రశంసలు అందుకొంది.
ఆ సినిమా తర్వాత తన రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ తీస్తానని ప్రకటించాడు. నాని హీరోగా నటించేందుకు ఉత్సాహం చూపాడు. ఆ తర్వాత ఎందుకనో నాని ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో నితిన్ హీరోగా సినిమా తీయాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నించారు. కానీ నితిన్ వరుస ఫ్లాపుల కారణంగా ఇది వర్కవుట్ కాదని వదిలేశారు. ఇప్పుడు ఈ సినిమాకి హీరో కావాలి.
నితిన్, నాని వంటి హీరోలను అనుకోని ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వద్ద ఆగారని అంటున్నారు. కానీ ఈ బెల్లంకొండ అయినా ఒప్పుకొని సినిమా చేస్తాడా?
బలగం వంటి హిట్ తర్వాత కూడా వేణు హీరోల కోసం తిప్పలు పడుతున్నాడు. అదీ కూడా దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత అండ ఉన్నా కూడా. అట్లుంటది మన తెలుగు హీరోల సంగతి.