పొలిటికల్ ఎంట్రీకి విజయ్ రెడీ

Vijay

తమిళనాడులో కూడా రాజకీయ వేడి మొదలైంది. తమిళ అగ్ర హీరో విజయ్ త్వరలోనే ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయన పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు వేగవంతం చేశారు. ఒకవేళ లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిపితే దానికి రెడీగా ఉండాలనేది ప్లాన్.

విజయ్ నటించిన ‘లియో’ వచ్చే నెల విడుదల కానుంది. ఆ తర్వాత దర్శకుడు వెంకట్ ప్రభు తీసే సినిమాలో నటిస్తారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్నికలకు రెడీ అవుతారని సమాచారం. మొదట తన పార్టీ తరఫున కొందరు అభ్యర్థులను నిలిపి గెలిపించుకొని, ఆ తర్వాత పార్టీ యంత్రాంగం ఏర్పాటు చేసుకొని, తాను ఎన్నికల బరిలో దిగుతారట.

5 ఏళ్ల తర్వాత తమిళనాడు సీఎం అవ్వాలనేది విజయ్ టార్గెట్. పార్టీ రిజిస్ట్రేషన్ కి కావాల్సిన కసరత్తు ఆల్రెడీ మొదలైంది.

విజయ్ ఇక సినిమాలు తగ్గిస్తారు అని అంటున్నారు.

Advertisement
 

More

Related Stories