
లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి పనులు మొదలయ్యాయి. నవంబర్లో వీరి పెళ్లి జరగనుంది. పెళ్లి, సంగీత్, రిసెప్షన్… ఇలా భారీ ఎత్తున సాగే వేడుకలకు సంబంధించి మొత్తం ఒక థీమ్ తో కూడిన దుస్తులు ధరించాలి అని ఇద్దరూ డిజైనర్లని సంప్రదించారు.
తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్ కి ఇద్దరూ వెళ్లారు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్. పెళ్లి వేదిక నుంచి వారు ధరించే దుస్తుల వరకు ఒకే కలర్ స్కీమ్ ఉంటుందట.
లావణ్య, వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుక జూన్ లో జరిగింది. పెళ్ళి నవంబర్ లో ఇటలీలో జరుగుతుంది. ఈ లోపు వరుణ్ తేజ్ తాను నటిస్తున్న “ఆపరేషన్ వాలెంటైన్” షూటింగ్ పూర్తి చేస్తాడు. లావణ్య కూడా వెబ్ సిరీస్ లకు సంబంధించిన వర్క్ కంప్లీట్ చేస్తోంది.
గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట తమ పెళ్లి వేడుక మెమొరబుల్ గా ఉండేలా ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు. వెడ్డింగ్ రిసార్ట్ కూడా వల్లే సెలెక్ట్ చేశారు.