
విజయశాంతి, జయసుధ, జీవిత, మాధవీలత, కరాటే కళ్యాణి… వీరంతా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడనున్నారు. ఇందులో ఒక్కరు తప్ప మిగతా వారంతా ఆంధ్రప్రాంతానికి చెందినవారే.
బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిల్చున సినిమా తారల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పటివరకు ఐదుగురు కంఫర్మ్ అయ్యారు. వీరిలో విజయశాంతికి టికెట్ కన్ఫర్మ్. ఆమె బీజేపీలో సీనియర్ నేత. జయసుధ ఇటీవలే పార్టీలో చేరారు. చేరకముందే ఆమెకి సీటు ఇస్తామని పార్టీ చెప్పింది. జీవిత, మాధవీలత, కరాటే కళ్యాణిలో ఒకరికి సీటు ఖాయం. జీవిత, కరాటే కళ్యాణి చెరో నాలుగు సీట్లకు అప్లికేషన్ పెట్టుకున్నారట. ఆ నాలుగింటిలో ఎదో ఒకటి ఇమ్మని కోరారు.
ఇక ఎన్నికల్లో ప్రచారానికి మరికొందరు సెలెబ్రిటీలను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. బాబుమోహన్ లాంటి వాళ్ళు ఎలాగూ ఉన్నారు. ఐతే తెలంగాణ పార్టీల్లో ఎక్కువ గ్లామర్ తారల పార్టీ ఉన్నది మాత్రం బీజేపీలోనే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఇప్పటికే మొదలైంది. కానీ నోటిఫికేషన్ వచ్చాక సినిమా తారల సందడి మరింతగా మొదలవుతుంది.