భాగ్యశ్రీ తదుపరి ప్లాన్ ఏంటి?

TeluguCinema 11 Dec 2025
Bhagyashri Borse

భాగ్యశ్రీ బోర్స్ తన తదుపరి ప్లాన్ ఏంటో ఇంకా వెల్లడించలేదు. ఈ అమ్మడు 16 నెలల కాలంలోనే నాలుగు సినిమాల్లో నటించింది, విడుదల చేసింది. ఒక్క సినిమా కూడా ఆడలేదు. కానీ పాపులారిటీ మాత్రం ఫుల్లుగా వచ్చింది.

ఆగస్టు 2024లో ఆమె మొదటి తెలుగు చిత్రం విడుదలైంది. అదే “మిస్టర్ బచ్చన్.” ఆ తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకొంది. ఒప్పుకున్న మూడు సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యాయి. అవే…విజయ్ దేవరకొండ మూవీ “కింగ్ డమ్”, దుల్కర్ సల్మాన్ “కాంత”, రామ్ పోతినేని సినిమా “ఆంధ్ర కింగ్ తాలూకా”. ఒకే ఏడాది మూడు సినిమాలు వస్తే అందులో ఒక్కటీ హిట్ కాలేదు.

క్రేజ్ ఎంత వచ్చినా… ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ముఖ్యం. అదే ఆమెకి లేదు. దాంతో తదుపరి సినిమా ఆఫర్లు ఎలా ఉంటాయో చెప్పలేం. మరి, ఈ భామ తెలుగులోనే సినిమాల కోసం వెయిట్ చేస్తుందా? లేక తమిళ సినిమాల వైపు వెళ్తుందా? అనేది చూడాలి.

ఐతే, ఈ భామ హీరో రామ్ పోతినేనితో ప్రేమలో పడింది అని చాలా ప్రచారం జరుగుతోంది. “ఆంధ్ర కింగ్ తాలూకా” సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని, అది ముదిరి పెళ్లి ఆలోచన వరకు వెళ్లిందని పుకార్లు షికార్లు చేశాయి. మరి, ఈ వార్తల్లో నిజం ఉంటే వచ్చే ఏడాది వీరి పెళ్లి అవుతుందా? లేక కేవలం ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి కెమిస్ట్రీని చూసి అలా పుకార్లు వచ్చాయా అనేది త్వరలోనే తేలుతుంది.

ప్రస్తుతం ఈ భామ అఖిల్ అక్కినేని సరసన “లెనిన్” అనే సినిమాలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమా తప్ప కొత్తగా ఆమెకి ఇంకా అఫర్ రాలేదు. “లెనిన్” కూడా చాలా నెలల క్రితమే వచ్చిన ఆఫర్.