అనుష్క పబ్లిక్ ముందుకి రాదా?

Ms Shetty Mr Polishetty

అనుష్క నటించిన కొత్త చిత్రం…. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాలో యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరో. 35 -40 మధ్య ఉండే ఒక లేడికి, ఒక 30 ఏళ్ల కుర్రాడికి మధ్య ప్రేమ ఈ సినిమా. అలాగే పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనేందుకు హెరాయిన్ స్పెర్మ్ డొనేషన్ అడిగే బోల్డ్ పాత్రలో అనుష్క నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్రైలర్ చూస్తే అనుష్క మళ్ళీ మంచి గ్లామర్ తో మెరిసిపోతోంది అనిపిస్తోంది. కానీ ఈ సినిమా పబ్లిసిటీ కోసం మీడియా ముందుకు అనుష్క శెట్టి రాలేదు ఇప్పటి వరకు. ఇక ముందు ఐనా వస్తుందా అన్నదే ప్రశ్న.

ఆమె పబ్లిక్ గా దర్శనమిచ్చి మూడేళ్లు కావొస్తోంది. అనుష్క మీడియా ముందుకు కూడా వచ్చేందుకు జంకుతోంది. దానికి కారణమేంటో?

మరి ఈ కొత్త సినిమా కోసమైనా ఆమె ఒక్కసారైనా పబ్లిక్ గా దర్శనమిస్తుందా?లేక పబ్లిసిటీ బాధ్యత అంతా నవీన్ పోలిశెట్టినే చూసుకోవాల్సి వస్తుందా?

Advertisement
 

More

Related Stories