ఈ సీతకి ఆ సీతలా పేరు వచ్చేనా?

Ram Sita Ram


బాలీవుడ్ నటులు మొత్తంగా టాలీవుడ్ ని కమ్మేస్తున్నారు. విలన్ పాత్రలన్నీ బాలీవుడ్ హీరోలే దక్కించుకుంటున్నారు. అలాగే, పెద్ద సినిమాల్లో హీరోయిన్లుగా బాలీవుడ్ భామలనే తీసుకుంటున్నారు. అలా ఇటీవల తెలుగులో అడుగుపెట్టిన అలియా భట్ తెలుగు వారిని మెప్పించింది. ఇప్పుడు జాన్వీ కపూర్ వస్తోంది.

ఇక కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకి సిద్ధమైంది. ఈ భామ తెలుగువారికి కొత్తేమీ కాదు. ఆమె మొదటి చిత్రం తెలుగులోనే. మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కొడినే’ చిత్రంతో ఆమె హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. ఐతే, అది అపజయం చెందింది. దాంతో, ఆమె బాలీవుడ్ లోనే లక్ పరీక్షించుకొని అక్కడే స్థిరపడింది. అక్కడ పెద్ద హీరోయిన్ గా నిలబడింది.

ఇప్పుడు ఆమె నటించిన హిందీ చిత్రం తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల అవుతోంది. ‘ఆదిపురుష్’ సినిమాలో ఆమె జానకిగా నటించిన విషయం తెలిసిందే. సీతమ్మ వారి పాత్ర. రాముడిగా ప్రభాస్ నటించారు.

ఈ సినిమాతో ఆమె మళ్ళీ తెలుగు మార్కెట్ లో తన లక్ ని టెస్ట్ చేసుకుంటోంది. ఇటీవల ‘ఆర్ ఆర్ ఆర్’ అనే సినిమాలో అలియా భట్ ‘సీత’ అనే పాత్రలో కనిపించి తెలుగువారి మనసుని దోచుకొంది. ఐతే, ఆ సీత పాత్ర వేరు ఈ సీత పాత్ర వేరు. కానీ, అలియా భట్ లాగే తెలుగులో తనకి కూడా మంచి గుర్తింపుని కోరుకుంటోంది ఈ సీత.

కృతి సనన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలన్నీ గ్లామర్ రోల్స్. ‘ఆదిపురుష్’ ఆమెకి మొదటి పౌరాణిక చిత్రం. జానకి పాత్రలో నిష్ఠగా నటించిందట. సో, ఆమెకి లక్ కలిసి వస్తుందా అనేది చూడాలి. ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories