
విక్టరీ వెంకటేష్ కి ద్విపాత్రాభినయం కొత్త కాదు. రీమేకుల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు… ఆయన కెరీర్లో ఎక్కువ శాతం రీమేకులే. త్వరలో అమెజాన్ లో విడుదల కాబోతున్న ‘నారప్ప’ కూడా రీమేక్ చిత్రమే. ‘అసురన్’ అనే సినిమా ఆధారంగా తీసిన మూవీ ఇది. ఇందులో వెంకటేష్ డబుల్ రోల్ పోషించారు.
తండ్రిగా, కొడుకుగా ధనుష్ మెస్మరైజ్ చేసి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న చిత్రం… అసురన్. ఆ పాత్రల్లో వెంకటేష్ నటిస్తున్నారు. ధనుష్ యువకుడే. కొడుకు పాత్రకు సూటయ్యాడు. మరి వెంకటేష్ కి 60 ప్లస్. ఆయన కొడుకు యువకుడిగా మెప్పించగలరా? అదే పెద్ద సమస్యలా కనిపిస్తోంది తాజాగా విడుదలైన ట్రైలర్ లో.
తండ్రి పాత్రలో వెంకటేష్ బాగా సూటయ్యారు. కానీ కొడుకు రోల్ ల్లోనే ఎబ్బెట్టుగా కనిపిస్తున్నారు. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.
బాగున్నా… బాలేకపోయినా నిర్మాతలకు ఫరక్ పడదు. అమెజాన్ లోనే డైరెక్ట్ గా విడుదలవుతోంది కాబట్టి హిట్, ప్లాఫ్ అన్న గొడవ లేదు. ఆ విధంగా వెంకటేష్ పాస్ అయిపోయినట్లే.
శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. ఈ నెల 20న డైరెక్ట్ గా అమెజాన్ లో విడుదల కనుఁడి ‘నారప్ప’. ఈ రోజు విడుదలైన ట్రైలర్ చూస్తే తమిళ్ సినిమాని యాజిటీజ్ గా దించేశారనిపిస్తోంది. కానీ వెంకటేష్ రెండో పాత్రతోనే మనం కాస్తా సర్దుకోవాలి.