
నటి రాశీ ఖన్నా (Raashi Khanna) ఇటీవల శ్రీలీల (Sreeleela)కి మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆమె అద్భుతమైన డాక్టర్ అని ప్రశంసిస్తూ వీడియోని షేర్ చేసింది. తాను జ్వరం, ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సమయంలో శ్రీలీల తనను త్వరగా కోలుకునేలా చేసిందని రాశి ఖన్నా చెప్పింది.
“ఈ డాక్టర్‌ను నేనుఅందరికీ రికమెండ్ చేస్తాను శ్రీలీల నిజంగా మంచి డాక్టర్,” అని సరదాగా చెప్పింది. ఆమె చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
శ్రీలీల సినిమాల్లో నటిస్తూనే తన మెడికల్ చదువును పూర్తిచేసింది. ఇటీవల ఆమె ఎంబీబీఎస్ డిగ్రీని సంపాదించింది. డాక్టరేట్ అందుకొంది.
రాశీ ఖన్నా, శ్రీలీల కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరు ఇద్దరూ మెయిన్ హీరోయిన్లు. ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక వీరు కలిసి సినిమా ప్రమోషన్లలో పాల్గొననున్నారు.
