
జూనియర్ ఎన్టీఆర్ (NTR) కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. అతన్ని యంగ్ టైగర్ అనీ, మ్యాన్ ఆఫ్ మాసెస్ అనీ పిలుస్తారు. కానీ ఒక హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్తే జన ప్రభంజనం కనిపించడం ఆశ్చర్యం.
ఈ రోజు బెంగళూరులో ఈ దృశ్యం కనిపించింది. కిమ్స్ కి చెందిన ఒక ఆసుపత్రికి చెందిన ఎదో ఒక వింగ్ ని ప్రారంభించేందుకు ఎన్టీఆర్ వెళ్ళాడు. తారక్ ని కలిసేందుకు, చూసేందుకు జనం, అభిమాన గణం ఎగబడింది.
అంతేకాదు, భారీ ఎత్తున జనం అక్కడికి రావడం పెద్ద విశేషం అయితే ఆ ఫోటోలు, ఆ వీడియోలు ట్విట్టర్ మొత్తం హల్చల్ చెయ్యడం. సోషల్ మీడియా ఫీడ్ అంతా ఎన్టీఆర్ నామం చెయ్యడం, ట్రెండ్ అవ్వడం మరో విశేషం.
ఎన్టీఆర్ నటించిన “వార్ 2” సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అయినా అతని ఇమేజ్ కొంత కూడా తగ్గలేదు. క్రేజ్ ఇంకా పెరిగింది. బెంగళూరులో పనిచేసే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా తెలుగువాళ్లే. అందుకే ఎన్టీఆర్ ని చూసేందుకు ఆ రేంజ్ లో జనం వచ్చారు.
