
తమిళ హీరో విశాల్ (Vishal) మరో చిత్రంతో మన ముందుకు రానున్నాడు.దర్శకుడు సుందర్ తో మరోసారి చేతులు కలిపాడు విశాల్. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ కొత్త సినిమాకి ‘మొగుడు’ (Mogudu) అనే పేరు ఖరారు చేశారు.
గతంలో గోపీచంద్ హీరోగా కృష్ణవంశీ ఇదే టైటిల్ తో ఒక సినిమా తీశారు. ఇప్పుడు ఈ కొత్త మొగుడు వస్తున్నాడు.
ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
‘మొగుడు’ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రోమోను ఇదివరకే రిలీజ్ చేశారు. షూటింగ్ ని త్వరలో కోల్ కత్తా, గోవా, చెన్నై ల్లో ప్లాన్ చేశారు. ఈ మూవీకి హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు.
