
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు “నాగబంధం” (Nagabandham) సినిమా గురించి హంగామా చేస్తోంది. అన్ని ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ పబ్లసిటీ కలిపిస్తోంది. ఆమెకి ఈ సినిమా కీలకం.
నభా ఈ సినిమాలో పార్వతి అనే పాత్ర చేసింది. వేద విద్యార్ధినిగా కనిపిస్తుంది. గ్లామర్ పాత్ర కాదు. నటనకు స్కోప్ ఉన్న రోల్. అందుకే ఈ సినిమా విషయంలో చాలా హడావిడి చేస్తోంది. ఈ శుక్రవారం (జులై 3) విడుదల అవుతోంది నాగబంధం. ఈ సినిమాని ఆమె రెండేళ్ల క్రితం ఒప్పుకొంది. ఇప్పటికీ విడుదల అవుతోంది.
ఈ సినిమా కన్నా ముందే “స్వయంభు” (Swayambhu) అనే మరో సినిమా ఒప్పుకొంది. అది కూడా పీరియడ్ చిత్రం. రాజుల కాలం నాటి కథ. కానీ ఈ సినిమా విడుదల విషయంలో గతేడాది నుంచి వాయిదాల మీద వాయిదా పడుతోంది. ఇది ఎప్పుడు వస్తుందో మరి.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ భామ చాలా సినిమాలు చేసింది. ఒక్కటీ ఆ సినిమాలా భారీ విజయం సాధించలేదు.
