
‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ (666 Operation Dream Theatre) టీమ్ మీడియాకు టీజర్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన డా. శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ, ప్రియాంక మోహన్, అదితి బాలన్ పాల్గొన్నారు.
టీజర్‌లో ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ మూవీ వరల్డ్ ని అద్భుతంగా చూపించారు. చిత్రాన్ని స్పై డ్రామాగా తెరకెక్కించారు. లెజెండరీ డా.రాజ్‌కుమార్ ‘సీఐడీ999’ని గుర్తుచేస్తూ, నివాళులర్పించేలా ఉంది టీజర్.
డా. శివరాజ్‌కుమార్ ఇందులో ఏజెంట్ ప్రకాష్‌గా కనిపించారు. స్క్రీన్ మీద ఫైర్ పుట్టించే ఆయన ప్రెజెన్స్ హైలైట్.
కథను విజువల్ పెయింటింగ్‌గా తీర్చిదిద్దారు అద్వైత గురుమూర్తి. గతాన్ని స్క్రీన్స్ మీదకు తీసుకురావడంలో ఆయన కృషి అభినందనీయం. హృద్యమైన కవిత్వాన్ని తెరమీద చూసినంత అందంగా తీర్చిదిద్దారు. ఆయన లైటింగ్ చేసిన విధానం, కెమెరా పనితీరు, ప్రతిదీ టీజర్‌లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది.
ప్రతి ఫ్రేమ్‌లోనూ తన దర్శకత్వ ప్రతిభను చూపించారు హేమంత్ రావు.
ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’కి ప్రత్యేక స్థానం ఉంది.
