ఇంటర్వ్యూలు

Aaya Sher కిక్ ఇచ్చింది: కాసర్ల శ్యామ్

నాని నటిస్తోన్న “ది ప్యారడైజ్” సినిమా నుంచి విడుదలైన మొదటి పాట “ఆయా షేర్” (Aaya Sher) సంచలనం సృష్టించింది. ఈ పాటని రాసింది కాసర్ల శ్యామ్. ఇటీవలే ఆయన బలగం చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

‘ఆయా షేర్’ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తోంది ?

పాట ప్రోమో విడుదలైనప్పటి నుంచే ఫోన్స్ వచ్చాయి. పాట రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది. అనిరుధ్ గారు నేను ఇచ్చిన పదాలు తీసుకొని జనాలకి రీచ్ అయ్యేవిధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు మరి ఏ పాట ఇవ్వలేదు. నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాట విన్న తర్వాత నాకు చాలా మెసేజుల వచ్చాయి. జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడే ఓ వ్యక్తి.. ఈ పాట విని ఒక కొత్త స్ఫూర్తి పొందానని చెప్పాడు. అలాంటి మెసేజ్లు చాలా వచ్చాయి.

ఈ సినిమాలో నాని గారి క్యారెక్టర్ లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల్ వెనుక మంచి కథ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆ జడలు గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా చూసిన తర్వాత వాటికి అద్భుతమైన జస్టిఫికేషన్ ఉంది అనుకుంటారు.

ఈ పాట సక్సెస్ కి ముఖ్య కారణం డైరెక్టర్ శ్రీకాంత్. జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తిని ఇచ్చే క్రమంలో వచ్చిన పాట ఇది. పాట రాయడానికి వారం రోజులు పట్టింది. కొన్ని వెర్షన్స్ డెవలప్ చేసుకుంటూ చివరికి దీనిని ఫిక్స్ చేశాం. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పడానికి ఒక ప్రత్యేకమైన పల్లవి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచన శ్రీకాంత్ గారికి నచ్చింది.

తెలంగాణ మండలికంలో పాటంటేనే మీ పేరు గుర్తొస్తుంది కదా….

చాలా ఆనందంగా ఉంది. సీనియర్ కవులని స్ఫూర్తిగా తీసుకునే ముందుకు సాగుతున్నాను. నేను రాసిన ఎక్కువ పాటలు తెలంగాణ యాసలో వచ్చాయి. కానీ నేను రకాల పాటలు రాశాను.

బలగం సినిమాకి జాతీయ రావడంతో ఓ మెట్టు ఎక్కాను అని అనుకుంటున్నారా?

పల్లె భాషను నమ్ముకుని పరిశ్రమకు వచ్చాను. ఆ పల్లె భాష ఈ రోజు దేశవ్యాప్తంగా మోగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరుగునపడిన భాష పదాలు నా ద్వారా మళ్ళీ వెలుగులోకి రావడం, ఈ జనరేషన్ యువత కూడా ఆ పదాల్ని వాడుకోవడం నాకు రచయితగా చాలా ఆనందాన్నిస్తోంది. నేను గురువుగా భావించే మా చంద్రబోస్ గారు నేషనల్ అవార్డు రాగానే నాకు ఫోన్ చేసి ‘చాలా తక్కువ సమయంలో అచీవ్ చేశారు తమ్ముడు’ అన్నారు. అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది.

రచయితగా మీ ప్రయాణం సంతృప్తినిచ్చిందా?

నా మొదటి సినిమా “చంటిగాడు”. “మహాత్మా” సినిమాలో “నీలపూరి గాజులు” అనే పాటతో నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు రాశాను. అయితే “లై” సినిమాతో మళ్లీ నాకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత ఇస్మార్ట్ శంకర్, అల వైకుంఠపురంలో, డిజె టిల్లు.. వరుసగా విజయవంతమైన పాటలు వచ్చాయి.

మీ అబ్బాయిలు సినిమాల్లోకి వస్తారా?

పెద్దబ్బాయి యూఎస్ లో చదువుతున్నాడు. చిన్నవాడికి మాత్రం నటన సంగీతం అంటే ఆసక్తి ఉంది. హిందుస్తానీ సంగీతం నేర్చుకుంటున్నాడు. డాకు మహారాజ్, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించాడు.

ప్రస్తుతం రాస్తున్న సినిమాలు?

లెనిన్, మా ఇంటి బంగారం, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ రెడీగా ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు నడుస్తున్నాయి.

TeluguCinema

Recent Posts

Lenin: హీరోకి, హీరోయిన్ కి ఒకేసారి పరీక్ష

ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…

10 hours ago

Mumait Khan బుర్రలో టైటానియం

ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…

11 hours ago

సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…

1 day ago

సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj

పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…

1 day ago

పోలీసుగా మారనున్నSai Pallavi

హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…

1 day ago

Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…

2 days ago