‘కుబేర’ సినిమా సక్సెస్ అయిన వెంటనే నాగార్జునపై ఓ చిన్నపాటి వివాదం తలెత్తింది. ప్రచారంలో దీన్ని కమ్ముల సినిమాగా చెప్పుకొచ్చిన నాగ్, సినిమా హిట్టయిన వెంటనే దీన్ని తన సినిమాగా చెప్పడాన్ని చాలామంది తప్పుబట్టారు. కథనాలు కూడా వచ్చాయి.
దీనిపై నాగార్జున స్పందించాడు. సుదీర్ఘంగా వివరణ ఇచ్చాడు. ఎప్పటికీ ఇది శేఖర్ కమ్ముల సినిమానే అని స్పష్టం చేశాడు. తామంతా కమ్ముల తర్వాతే వస్తామని క్లారిటీ ఇచ్చాడు.
“దీపక్ పాత్ర చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి. దీపక్ పాత్ర పోషించింది నేను. కాబట్టి ఇది నా సినిమా అనుకొని చెప్పాను. దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. విడుదలకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నారు, రిలీజై హిట్టయిన తర్వాత నా సినిమా అంటున్నానంటూ మీమ్స్, స్టోరీలు ఇచ్చారు. నేను మళ్లీ చెబుతున్నాను. ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల సినిమా. మేమంతా ఆయన తర్వాతే వస్తాం. శేఖర్ కమ్ముల తర్వాతే ఇది మా సినిమా అవుతుంది.”
‘కుబేర’ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. సమీక్షలన్నీ పాజిటివ్ గా వచ్చాయి. వసూళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. శేఖర్ కమ్ముల సినిమాల్లో హిట్ గా నిలిచింది ఈ మూవీ. అటు నాగార్జునకు కూడా ఆర్టిస్టుగా కొత్త దారి చూపించింది.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…