ఆనందంగా ఉండమంటున్న భామ

anusuya stills 160623 007


మొన్నటివరకు అయిందానికి కానిదానికీ ఫైర్ అయ్యేది అనసూయ. ఆమెని కూడా నెటిజెన్లు రెచ్చెగొట్టేవారు ‘ఆంటీ’ అనే కామెంట్లతో. ఐతే, ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి తగ్గించి… వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించే పనిలో పడింది. భర్తతో కలిసి విహారయాత్రలు చేస్తోంది. అక్కడ బికినిలో దిగిన ఫోటోలను, వీడియోలను ఆనందంగా షేర్ చేస్తోంది.

ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. తమ జీవితాన్ని ఆస్వాదించాలి అని ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతోంది ఈ భామ.

ఇంతకుముందు విజయ్ దేవరకొండ గురించి వ్యతిరేకంగా ఎక్కవుగా ట్వీట్లు వేసేది అనసూయ. ఇప్పుడు రాజీకొచ్చింది. ఆయన తప్పేమి లేదు కానీ ఆయన టీం వల్లే తాను అలా అతనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది అని తెలిపింది అనసూయ. ఐతే, తన ట్వీట్ల వల్ల తనకే ఎక్కువ ఇబ్బంది అవుతోందని గ్రహించింది. మానసిక ప్రశాంతత ఉండడం లేదు అని ఒప్పుకొంది.

ALSO CHECK: Anasuya in a white bikini

anusuya stills 160623 006

అందుకే, ఇప్పుడు పర్సనల్ లైఫ్లో ఆనందంగా ఉండేలా ప్రవర్తిస్తోంది. ఈ బికినీ ఫోటోలు సోషల్ మిడియాలో రచ్చ చేశాయి. ఆమె చేతిలో ఇప్పుడు ‘పుష్ప 2’ ఉంది.

More

 

Related Stories