రష్మిక డైరెక్ట్ గా చెప్పేసింది

TeluguCinema 31 Jul 2025
rashmika stills 190625 03

రష్మిక మందాన విజయ్ దేవరకొండకి ప్రియురాలు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ వాళ్లు ఇప్పటివరకు బహిరంగంగా చెప్పలేదు. కానీ తాజాగా రష్మిక తన ఆనందాన్ని దాచుకోలేదు. విజయ్ దేవరకొండ సినిమాకి మొదటి రోజు భారీ ఓపెనింగ్ రావడంతో “మనం కొట్టినం” అని చెప్పేసింది.

మనం అంటే విజయ్ దేవరకొండ, తాను అని. ఇద్దరూ ఒకటే అని డైరెక్ట్ గా చెప్పేసింది.

రష్మిక, విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ఆలోచన కూడా ఉంది. ఐతే, “సరైన” సమయంలో ప్రకటించాలని అనుకుంటున్నారు. ఐతే, ఇలా అప్పుడప్పుడు మొత్తంగా బయటపడిపోతున్నారు.

విజయ్ దేవరకొండ గత చిత్రం “ఫ్యామిలీ స్టార్” సరైన ఓపెనింగ్ కూడా తెచ్చుకోలేదు. దాంతో, ఈ సినిమాకి ఓపెనింగ్ వస్తుందా రాదా అనే డౌట్ ఉండింది. కానీ, ఆ అనుమానాలు అన్నీ పటాపంచలు అయ్యాయి. మొదటి రోజు ఊహించని రీతిలో కలెక్షన్లు దక్కాయి. దాంతో ఆనందంతో రష్మిక అలా “మనం” అని బయటపడింది.

ఇక తర్వాత వచ్చే ప్రకటన కేవలం లాంఛనమే. ఇప్పుడు తమ రిలేషన్ గురించి చెప్పేసినట్లే.