జారిపడింది రజినీకాంత్ కాదు

Coolie

తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది సూపర్ స్టార్ రజీనీకాంత్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అది రజినీకాంత్ కాదు అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

ఆ వీడియోలో ఏముంది అంటే బట్టతలతో ఉన్న వయసుమళ్ళిన ఓ వ్యక్తి తన ఇంటి గేట్ ముందు వేసిన న్యూస్ పేపర్ తెచ్చుకునేందుకు వెళ్తాడు. పేపర్ తీసుకొని తిరిగి వస్తున్నప్పుడు వర్షం వల్ల తడిగా ఉన్న ఆ మెట్ల నుంచి జారిపడిపోతాడు. అలా జారిపడింది రజినీకాంత్ అని ప్రచారం చేశారు.

కొంచెం రజినీకాంత్ పోలికలు ఉన్న మాట వాస్తవమే కానీ ఆయన రజినీకాంత్ కాదు. అది రజినీకాంత్ ఇల్లు కూడా కాదు. కొంతమంది ఈ సూపర్ స్టార్ ని వెక్కిరించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఫేక్ వీడియోని ప్రచారంలోకి తెచ్చారు అని రజినీకాంత్ అభిమాన సంఘం సభ్యులు తెలిపారు. ఒక గొప్ప సూపర్ స్టార్, అదీ కూడా వయసులో పెద్దవారైన రజినీకాంత్ ని కూడా ఇలా నీచంగా ట్రోల్ చేస్తున్నారు అని వారు మండిపడుతున్నారు.

తమిళనాట రాజకీయాల్లో భాగంగా ఇలా రజినీకాంత్ ని ట్రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తమిళ్ అగ్ర హీరో విజయ్ తన పార్టీతో ఎన్నికల బరిలో దిగుతున్నారు. రజినీకాంత్ ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తారట.

More

 

Related Stories