నేను ఎవరినీ వాడుకోలేదు: సేతుపతి

TeluguCinema 31 Jul 2025
Vijay Sethupathi

విజయ్ సేతుపతి ఒక అమ్మాయిని లైంగికంగా వాడుకున్నాడు అని ఆమె స్నేహితురాలు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పెద్ద కలకలం సృష్టించింది.

“విజయ్ సేతుపతి బయటికి మర్యాదరామన్నలా కనిపిస్తాడు. కానీ అతను నా స్నేహితురాలి జీవితం పాడు చేశాడు. తన కారవాన్ లోకి వచ్చి ‘సపర్యలు’ చేస్తే రెండు లక్షలు, కాసేపు కారులో షికారు చేస్తే 50 వేలు ఆఫర్ చేసి, ఆమెని తెగ వాడుకున్నాడు,” అని ఒక యువతి ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

దాంతో విజయ్ సేతుపతి తాజాగా ఈ విషయంలో స్పందించారు.

“నా గురించి తెలిసిన వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చూసి నవ్వుతారు. ఈ రకమైన నీచమైన ఆరోపణలు నన్ను పెద్దగా బాధించవు కానీ నా భార్య, పిల్లలకు ఇబ్బంది. కొన్ని నిమిషాల కీర్తి కోసం ఇలాంటి ఆరోపణలు చేసే వారి గురించి పట్టించుకోవద్దు అని నా వారికి చెప్పాను, అని విజయ్ సేతుపతి అన్నారు.

“కొంతకాలంగా రకరకాల ప్రచారాలను ఫేస్ చేశాను. నా ఎదుగుదలని అడ్డుకోవాలని వారి లక్ష్యం. ఇప్పటివరకు నన్ను కిందికి దిగజారేలా ఏ వ్యక్తి, శక్తి చేయలేదు,” అని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి పూరి జగన్నాధ్ డైరెక్షన్లో నటిస్తున్నారు. హీరోగా అతనికి ఇదే మొదటి తెలుగు చిత్రం. ఇంతకుముందు “సైరా”, “ఉప్పెన” వంటి చిత్రాల్లో నటించారు.