
జులై మొదటి వారంలో ‘తమ్ముడు’, ‘షో టైమ్’, ‘3 BHK’, ‘ఉప్పు కప్పురంబు’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ‘ఉప్పు కప్పురంబు’ ఒక్కటే నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వగా, మిగతావన్నీ థియేటర్లలోకి వచ్చాయి. నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమాతో పాటు, మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
రెండో వారంలో ‘ఓ భామ అయ్యో రామ’, ‘దీర్ఘాయుష్మాన్ భవ’, ‘విర్జిన్ బాయ్స్’, ‘మాలిక్’, ‘100’, ‘సూపర్ మేన్’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ వారం కూడా ఒక్క హిట్ లేదు. హిట్ మాట అటుంచితే, కనీసం విడుదలకు ముందు బజ్ కూడా లేకుండా వచ్చాయి ఈ సినిమాలు.
మూడో వారంలో ‘పోలీసువారి హెచ్చరిక’, ‘మై బేబీ’, ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’, ‘జూనియర్’ సినిమాలొచ్చాయి. ఈవారం మాత్రం ‘జూనియర్’ సినిమాపై కాస్త బజ్ వచ్చింది. దీనికి కారణం వైరల్ సాంగ్. అయితే ఆ పాట హిట్టయిన రేంజ్ లో సినిమా ఆడలేదు. మిగతా సినిమాల సంగతి సరేసరి.
నాలుగో వారంలో ‘హరిహర వీరమల్లు’, ‘మహావతార్ నరసింహా’ సినిమాలు రిలీజయ్యాయి. పవన్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమాకు ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం లేదు.
జులైకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ ‘కింగ్డమ్’ సినిమా రిలీజైంది. ఈ సినిమాకు కూడా ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. కాబట్టి దీని ఫలితాన్ని అప్పుడే చెప్పలేం. ఈ నెలలో థియేటర్లలోకి వస్తున్న ‘వార్-2’, ‘కూలి’ సినిమాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.





