సమంత ‘రింగ్’ రూమర్లు

TeluguCinema 02 Aug 2025
samantha ring aug022025

సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. వీరి పెళ్లి గురించి కూడా చర్చ జరుగుతోంది.

తాజాగా సమంత కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. “మీరు వదిలి వెళ్ళేది బాగా బతికినా జీవితాన్ని మాత్రమే,” అని రాసుకొంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమె ఆనందంగా రెస్టారెంట్ లలో భోజనం చేస్తున్న ఫోటోలు, పూల బొకేలు తీసుకుంటున్న ఫోటోలు, ఆనందంగా టూర్లకు వెళ్లిన ఫోటోలు ఉన్నాయి ఇందులో.

వీటిలో ప్రత్యేకంగా అందరినీ ఆకర్శించింది మాత్రం… ఆమె చేతికి రింగ్ తొడిగిన ఒక ఫోటో. దాంతో, రాజ్ నిడిమోరు, సమంతకి నిశ్చితార్థం జరిగింది అని రూమర్లు మొదలయ్యాయి. పూల బొకేలు తీసుకుంటున్న ఫోటో కూడా ఆ సెలెబ్రేషన్స్ లో భాగమే అని అంచనా వేస్తున్నారు నెటిజెన్స్.

2017లో సమంత, నాగ చైతన్యని పెళ్లాడింది. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత సమంత అనారోగ్యంతో బాధపడింది. ఇప్పుడు మళ్ళీ క్యూర్ అయింది. గత రెండేళ్లుగా రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటోంది. ఇటీవలే వీరు ఇద్దరూ కలిసి బయటికి వస్తున్నారు. రాజ్ నిడిమోరు కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు టాక్.