పూరితో పాటు త్రివిక్రమ్ కూడా!

R Narayanamurthy with Trivikram

కొన్ని ఏళ్ల కిందటి సంగతి. అప్పట్లో ఎన్టీఆర్ తో “టెంపర్” సినిమా చేశాడు పూరి జగన్నాధ్. ఆ సినిమాలో కీలక పాత్ర కోసం ఆర్.నారాయణ మూర్తిని అనుకున్నారు. ఆయన కోసం గట్టిగా ప్రయత్నించారు కూడా.

కానీ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆర్.నారాయణమూర్తి ఒప్పుకోలేదు. అందుకే ఎంత ఆఫర్ చేసినా ఆ సినిమాలో నటించలేదు. అయితే అలా ప్రయత్నించిన దర్శకుడు పూరి జగన్నాధ్ మాత్రమే కాదు. ఆ లిస్ట్ లో త్రివిక్రమ్ కూడా ఉన్నారు.

“ఓ సినిమాలో పాత్రకు ఆర్.నారాయణమూర్తిని అనుకున్నాం. కానీ ఆయన చేయరని ఎవరో నాకు చెప్పారు. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఆర్.నారాయణమూర్తిని కొనలేరు అని నాతో చెప్పారు.”

ఆర్.నారాయణ మూర్తి డబ్బుల కోసమో, సక్సెస్ కోసమో సినిమాలు చేయరని, ఆయన మనసుకు నిజం అనిపించింది మాత్రమే తెరపై చూపిస్తారని అన్నారు త్రివిక్రమ్. ఆ నిజాయితీ వల్లనే ఆయనకు ఎనలేని గౌరవం దక్కుతోందని అన్నాడు. 

ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్) ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు.

More

 

Related Stories