
మీనాక్షి చౌదరికి మంచి హిట్ దక్కింది తెలుగులో. ఈ ఏడాది “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ పొందింది. ఇక ఇప్పుడు నాగ చైతన్యతో ఒక సినిమా, నవీన్ పోలిశెట్టితో మరో సినిమా చేస్తోంది.
ఈ రెండు సినిమాలు కాకుండా మరో బడా తెలుగు సినిమా కూడా చర్చల దశలో ఉంది. ఆమె పాపులారిటీని చూసి బాలీవుడ్ మేకర్స్ కూడా ఆమెకి అవకాశాలు ఇస్తున్నారు.
తాజాగా జాన్ అబ్రహం హీరో సరసన ఆమెకి ఆఫర్ వచ్చిందిట. 50 ప్లస్ జాన్ అబ్రహంతో ఈ భామ నటించనుంది అన్నమాట. ఆమె పుట్టింది, పెరిగింది అంతా నార్త్ ఇండియాలోనే. కానీ పేరు, అవకాశాలు వచ్చింది మాత్రం సౌత్ లో. సో, ఇప్పుడు నార్త్ భామగా బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతోంది.
ALSO READ: Meenakshi Chaudhary at GAMA event in Dubai
మీనాక్షి చౌదరి ఇటీవలే జపాన్ ట్రిప్పు వేసి వచ్చింది ఫ్యామిలీతో కలిసి. మంచి సంపాదనతో, కెరీర్ ఊపుతో ఆనందంగా ఉంది.





