అప్పుడు సమంత, ఇప్పుడు శోభిత

TeluguCinema 07 Sep 2025
Naga Chaitanya and Sobhita

నాగచైతన్య మొదటి భార్య సమంత. అప్పట్లో నాగచైతన్యకు సంబంధించిన సినిమాల్లో ఆమె ప్రమేయం ఉండేది. ఎడిటింగ్ వెర్షన్ చూడడం, కొన్ని కథలు వినడంలో సమంత పాత్ర ఉండేది. ఈ విషయాన్ని గతంలో నాగచైతన్య వెల్లడించాడు కూడా.

ఇప్పుడా స్థానంలోకి శోభిత వచ్చిందంటున్నాడు చైతూ. నాగచైతన్య జీవితంలో సమంత స్థానంలోకి వచ్చిన శోభిత, ప్రొఫెషనల్ గా కూడా వ్యవహరిస్తోందంట. ఈ విషయాన్ని కూడా నాగచైతన్యే బయటపెట్టాడు.

సమంత రేంజ్ లో మరీ కథలు విని, ఎడిటింగ్ టేబుల్ పై కూర్చోనప్పటికీ.. సోషల్ మీడియాలో ట్రెండ్స్ ను, సినిమా స్టోరీల్లో ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు చైతూకు చెబుతుందంట. ప్రస్తుతం ఆమె సలహాలు పాటిస్తున్నానని చెప్పాడు చైతూ.

ALSO READ: Sobhita steps into the kitchen for Chay?

లార్జర్ దేన్ లైఫ్ స్టోరీల్ని ఎంపిక చేసుకోవడం వెనక శోభిత సలహా కూడా ఉందంటున్నాడు.